FbTelugu

ఇది ఉంటేనే బంగారం విక్రయించాలి

ముంబయి: భారతదేశంలో బంగారానికి ఉన్న విలువ, డిమాండ్ అంతా ఇంతా కాదు. మహిళల వద్ద ఏ కాస్త డబ్బులు ఉన్నా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అయితే బంగారు ఆభరణాలకు ప్రభుత్వం హాల్ మార్క్ తప్పనిసరి చేసింది.

హాల్ మార్క్ లేని బంగారు ఆభరణాలను జూన్ 1 తరువాత విక్రయించకూడదు. బిఐఎస్ (బ్యూరో ఆప్ ఇండియన్ స్టాండర్డ్) రిజిష్టర్డ్ జ్యుయల్లర్స్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బంగారం స్వచ్ఛత ఇప్పుడు మూడు గ్రేడ్లుగా వర్గీకరించారు. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లలో లభిస్తుంది. హాల్ మార్క్ మూలంగా కొనుగోలుదారుడు, స్వర్ణకారుడు ఇద్దరికి ప్రయోజనం ఉండనున్నది. జూన్ 1 నుంచి బిఐఎస్ అమలు చేయనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.