FbTelugu

ధాన్యం విక్రయాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు

అమరావతి : రైతుల ధాన్యం విక్రయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కనీస మద్దతు ధర గ్రామస్థాయిలోనే తెలిసేలా చర్యలు తీసుకొని, కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.

గ్రామంవారీగా ప్రతిరోజూ అమ్మకాలను పర్యవేక్షించాలని తెలిపింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జీపీఎస్ వాహనాలతో రైస్ మిల్లుకు చేర్చాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా సమస్యలు తలెత్తితే రైతులు 1902 కి ఫిర్యాదు చేయాలని సూచించింది. రైతులు తమ ఆధార్, పోన్ నంబర్లతో పేరు నమోదు చేసుకోవాలని, బ్యాంక్ పాస్ బుక్, పట్టా బుక్ జీరాక్స్ లను సమర్పించాలని తెలిపారు.

You might also like