FbTelugu

మందుబాబులకు ఫుల్ మందు

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‎డౌన్ నేపథ్యంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైందని అంటున్నారు. రాష్ట్రంలో పదిరోజుల పాటు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

లాక్డౌన్ కాలంలో వైన్స్‌ లను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లాక్డౌన్లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఈ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది. ఇక మందుబాబులు లాక్డౌన్లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.