అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పట్ల ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో చేసిన తీర్మానంపై ఏపీ ఎస్ఈసీ (రాష్ట్ర ఎన్నికల కమిషనర్) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు లేవనెత్తారు. ప్రభుత్వ అనుమతితో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్ విధి అన్నారు. ఆర్టికల్ 243(కె) ప్రకారం.. ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక ఆర్డినెన్స్ ను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని తిరస్కరించాలంటూ కోరారు.