FbTelugu

10 వర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు

హైదరాబాద్: రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. కరోనా నేపథ్యం లో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి రాషట్ర గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది.
శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, విసి ల నియామకానికి ఆమోదం తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు అర్హులైన వారితో జాబితా రూపొందించింది. విసిల నియామకం వివరాలు ఇలా ఉన్నాయి.

1. ఉస్మానియా యూనివర్సిటీ విసి గా ప్రొ. డి.రవీందర్ యాదవ్ (బిసి) ,
2. కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) ప్రొ. టి.రమేష్ (బిసి),
3. తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) ప్రొ. డి. రవీందర్ (ఓసి ఆర్యవైశ్య),
4. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి ప్రొ. సీతారామారావు (ఓసి, బ్రాహ్మణ),
5. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ప్రొ. టి.కిషన్ రావు ( ఓసి వెలమ),
6. పాలమూరు యూనివర్సిటీ ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్(ఎస్టీ),
7. మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్గొండ) ప్రొ. సిహెచ్.గోపాల్ రెడ్డి (ఓసి),
8. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి (ఓసి),
9. శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్) ప్రొ.మల్లేశం (ఎస్సి మాల),
10. జెఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, కవితా దర్యాని (ఓసి, సింధి).

You might also like

Leave A Reply

Your email address will not be published.