FbTelugu

ఏపిలో వారికి వ్యాక్సిన్లు లేవు

అమరావతి: రాష్ట్రంలో 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఏపీలో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ చేసేందుకు కోవిన్ ఫోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించింది. ఆ ప్రకారంగా మే 1 వ తేదీ నుంచి వీరికి ప్రాధన్యాతా క్రమంలో వ్యాక్సినేషన్ ఇవాళ్టి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైబడిన వారికి ఇంకా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం పూర్తి కాలేదు. వీరిలో ఫస్ట్ డోస్ తీసుకున్నవారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరికి సెకండ్ డోస్ ఇవ్వకుండా కొత్తగా రిజిష్టర్ చేసుకున్న యువతకు ఇవ్వడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. లేఖలో ఈ అంశాలను ప్రస్తావించడంతో పాటు, 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సమయం కోరనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.