FbTelugu

కరోనా ఆయుర్వేద మందుకు సర్కార్ ఓకే

అమరావతి: కంట్లో వేసే చుక్కల మందు తప్ప, ఆనందయ్య ఇస్తున్న ఇతర మూడు రకాల ఆయుర్వేద మందులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. మరో రకం మందులో ఉపయోగించే వనమూలికలు సరిగా లేకపోవడంతో నిరాకరించారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుకు రాష్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక నుంచి పి, ఎల్, ఎఫ్‌ అనే మూడు మందులు పంపిణీ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సిసిఆర్‌ఏఎస్‌) నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. కంట్లో వేసు మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉంది. మూడు రకాల మందుల వల్ల హాని లేదని పరిశోధనలో తేలింది. అదే సమయంలో  ఆనందయ్య మందు వాడితే కరోనా వైరస్ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు కూడా లేవని నివేదికలు తేల్చాయి. కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉంది. దీని నివేదిక రావడానికి మరో 2–3 వారాల సమయం తీసుకోనున్నది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం రోగులను కోరింది.

అల్లోపతి డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టా ప్రకారంగా వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. ఆయన ఇచ్చే మందును తీసుకోవడానికి కరోనా పాజిటివ్‌ రోగులు రాకుండా చూడాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. వారికి బదులుగా వేరేవారు వచ్చి మందును తీసుకెళ్తే వైరస్ విస్తరించే ప్రమాదం తప్పుతుందని ప్రభుత్వం తెలిపింది. కృష్ణపట్నంలో మందు పంపిణీ సమయంలో కరోనా ప్రోటోకాల్‌ పాటించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.