FbTelugu

గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ మాత్రమే

ఢిల్లీ: సునాయసంగా వినియోగించే అవకాశం ఉండడంతో పలువురు గూగుల్ పే యాప్ ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

గూగుల్ పే యాప్ పై ఢిల్లీ హైకోర్టులో బుధవారం వాదోపవాదనలు జరిగాయి. ఈ యాప్ థర్డ్ పార్టీ ప్రొవైడర్ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించదని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్బీఐ) హైకోర్టుకు తెలియచేసింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రచురిచిన ఆధీకృత చెల్లింపు వ్యవవస్థల ఆపరేటర్ల జాబితాలో ఇది లేదని స్పష్టం చేసింది.
ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్జిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్ లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. గూగుల్ పే ఆన్ లైన్ లో చెల్లింపు లావాదేవీలకు వేదికని, ఇది యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీసు ప్రొవైడర్ గా వ్యవహరిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.