FbTelugu

ఉద్యోగులపై గూగుల్ మరో సంచలన నిర్ణయం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు మరో ఏడాది పాటూ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై అంతర్జాతీయ ఛానెళ్లలో వార్తలు కూడా ప్రచురితమైనాయి.

వర్క్ ఫ్రం హోం విషయమై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బోర్డు సభ్యులతో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
అయితే ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. అయితే మరో ఏడాది పాటూ ఏ కంపెనీ కూడా కల్పించలేదు.

You might also like