FbTelugu

ఆస్ట్రేలియా దెబ్బకు దిగొచ్చిన గూగుల్

కాన్ బెర్రా: గూగుల్, ఫేస్ బుక్ మెడలు వంచిన దేశంగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ ఒత్తిడి, మీడియా సంస్థల ఆందోళనలకు ఈ రెండు కంపెనీలు తలొంచలేక తప్పలేదు.
దేశంలో అతి పెద్ద వార్తా సంస్థ అయిన సెవెన్ వెస్ట్ మీడియాతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఏడాదికి రూ.167 కోట్లు చెల్లించే విధంగా అంగీకారం తెలిపింది. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తమ వార్తలకు డబ్బులు చెల్లించాల్సిందిగా కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా మీడియా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. మీడియా సంస్థల న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. అయినా గూగుల్, ఫేస్ బుక్ సంస్థలు తలొగ్గలేదు.

ఈ రెండు సంస్థల మెడలు వంచేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగి ముసాయిదా బిల్లును రూపొందించింది. తమపై ఒత్తడి పెంచితో సెర్చింజన్ సేవలు నిలిపివేస్తామని హెచ్చరించాయి. అయితే ఆస్ట్రేలియా ఏమాత్రం బెదరలేదు. గూగుల్, ఫేస్ బుక్ ను నియంత్రించేందుకు మీడియా బార్గేయినింగ్ యాక్ట్ ను రూపొందించింది. త్వరలోనే పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో గూగుల్ సంస్థ రంగంలోకి దిగింది. పరిస్థితి చేయి జారుతుందని గమనించిన గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్, ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ లు ఆస్ట్రేలియా మంత్రులో చర్చలు జరిపారు. సోమవారం నాడు దేశంలో అతిపెద్ద వార్తా సంస్థ అయిన సెవెన్ వెస్ మీడియాతో చర్చలు జరిపింది. రూ.16 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పాటు మరో మూడు సంస్థలతోను, ఏడు న్యూస్ వెబ్ సైట్లతో అంగీకారం కుదుర్చుకోవడం విశేషం.
దీంతో ఇతర దేశాల్లోనూ గూగుల్ పై ఒత్తిడి పెరిగింది. గత నెల ఫ్రెంచ్ వార్తా సంస్థలతో గూగుల్ డబ్బులు చెల్లించేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నది. ఇందుకోసం గూగుల్ న్యూస్ షో కేసు ను ప్రారంభించింది. షో కేసు కింద ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన మీడియా సంస్థలతో విస్తృతంగా చర్చలు ప్రారంభించింది. ఇప్పటి వరకు షో కేసులో 450 మీడియా సంస్థలను చేర్చుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.