గూగుల్ డౌన్… జనం టెన్షన్…
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా గూగుల్, దాని అనుబంధ కంపెనీల సేవలు ఒక్కసారిగా స్థంభించిపోయాయి. యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే కోతి బొమ్మ కన్పించింది. జీ మెయిల్ తెరిస్తే టెంపరరీ ఎర్రర్ అని కన్పించడంతో ఒకటే కంగారు.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమస్య ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఒక్క దేశం కాదు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో జనం కంగారుకు లోనయ్యారు. ఏం జరిగిందంటూ ఆరా తీశారు. ఏమి జరిగిందనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ట్విటర్ లో జోకులు పేల్చుతూ సరదా తీర్చుకున్నారు.
కాగా నిలిచిపోయిన సేవలపై యూ ట్యూబ్ స్పందించింది. ఎక్కడ సమస్య ఉందనేది తెలుసుకుంటున్నారని, దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపింది.