FbTelugu

రాజకీయాలకు సీనియర్ నటుడు గుడ్ బై?

చెన్నై: ఇటీవలి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవ్వడంతో నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఒక్కటి కూడా గెలవకపోవడంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా వెదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఈ మేరకు ఆయన త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. పోటీ చేసిన స్థానాలతో పాటు కమల్ హాసన్ కూడా ఘోరంగా పరాజయం పాలయిన విషయం తెలిసిందే. ముఖ్య నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తుండడంతో మిగిలిన వారిలో నిరాశ కమ్ముకున్నది. శుక్రవారం నాడు మహేంద్రన్ కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. పార్టీకి ఆయన మోసం చేశారని, మేమే వెళ్లగొట్టాలని చూశామని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. మరో మూడేళ్ల వరకు పార్లమెంటు ఎన్నికలు లేకపోవడం, ఐదేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే  పరిస్థితి లేకపోవడంతో కమల్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

అప్పటి దాకా పార్టీ ని నడిపించడం తలకు మించిన భారం అవుతుందని, ఖర్చు తడిసిమోపెడు అవుతుందని కమల్ లెక్కలేసుకున్నారు. తాను వ్యతిరేకించే భావజాల పార్టీలు రాష్ట్రంలో అధికారానికి దూరం కావడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మళ్లీ ఎప్పటి లాగే రంగుల ప్రపంచంలో చేరి మేకప్ వేసుకుని సినిమాలు చేయాలనే నిర్ణయానికి కమల్ హాసన్ వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.