FbTelugu

వారికి తీపి కబురు

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న గూగుల్‌ ఉద్యోగులకు ఆ సంస్థ తీపి కబురు అందించింది. వారు ఇంటి నుంచి పని చేసుకోవడానికి వీలుగా ఉండే వస్తువులను కొనుక్కోవడానికి ఆ సంస్థ ఉద్యోగులకు వెయ్యి డాలర్లు (రూ.75వేలు) చెల్లించాలని నిర్ణయించింది.

అయితే, ఈ ఏడాది చాలా కొద్దిమంది ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు పిలుస్తారని ఆ సంస్థ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. సంస్థలోని ఎక్కువ మంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తారని ఆయన తెలిపారు. జూలై 6న పదిశాతం ఉద్యోగులతో వివిధ నగరాల్లో ఉన్న ఆఫీసులు ప్రారంభించే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. అన్నీ సజావుగా జరిగితే సెప్టెంబర్‌లో 30శాతం ఉద్యోగులను కార్యాలయానికి పిలుస్తామని ఆ సంస్థ తెలిపింది. మిగతా వారు ఇంటినుంచే పనిచేస్తారని కూడా ఆ సంస్థ తెలిపింది. ఇంటినుంచి పనిచేసే వారికి ఇంటిలో కూడా కొన్ని సౌకర్యాలు కల్పిస్తామని, వారు పనిచేసేందుకు కావాల్సిన వస్తువులు కొనేందుకు వెయ్యి డాలర్లను ఒక్కో ఉద్యోగికి ఇవ్వనున్నట్టు సంస్థ ప్రకటించింది.

You might also like