FbTelugu

ప్రజలూ జాగ్రత్త…!

ఢిల్లీ: దేశంలో ఇవాళ్టి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. కొన్ని ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్ చెబుతుంటే.. మ‌రికొన్ని జేబుకు చిల్లు పెట్ట‌నున్నాయి.
కార్లు, ద్విచక్ర వాహనాల ధ‌ర‌ల భారం క‌స్టమ‌ర్ల‌పై త‌గ్గి.. కొత్త వాహ‌నాల కొనుగోలుకు ఊత‌మిచ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ కాబోతున్నాయి. వాటిలో ముఖ్య‌మైనవాటి గురించి తెలుసుకుని.. అస‌లే క‌రోనా క‌ష్టాల స‌మ‌యంలో.. ప్ర‌జ‌లు త‌మ జేబు ఖాళీ కాకుండా చూసుకోవ‌డం చాలా అవ‌స‌రం..
ఇవీ కొత్త నిబంధనలు…

ఐఆర్‌డిఏ: కొత్తగా బైక్ లేదా కారు కొనేవారికి ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఏ) శుభ‌వార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలు కొనేవారికి కొత్త నిబంధనలు వ‌ర్తించ‌బోతున్నాయి. ఇప్పటి వరకు లాంగ్ ట‌ర్మ్ వెహిక‌ల్ ఇన్సూరెన్స్ ప్యాకేజీ పాల‌సీలు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రిగా ఉండేది. కరోనా కారణంగా ఇక‌పై అలాంటి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. దీంతో వాహనాలపై ఆన్ రోడ్డు ధర తగ్గనున్నది.

ఈ-కామ‌ర్స్: ఈ-కామ‌ర్స్ కంపెనీల ఉత్ప‌త్తుల‌పై ఏ దేశానికి చెందిన ప్రోడెక్ట్ అనే విష‌యాన్ని ఈ రోజు నుంచే వివ‌రించాల్సి ఉంటుంది. వినియోగ‌దారులు ఖరీదు చేసే వ‌స్తువులపై మేడ్ ఇన్ ఇండియాలో త‌యారు చేసిన వ‌స్తువులా? ★ లేదా ఇత‌ర దేశాల్లో త‌యారైన వ‌స్తువులా? అనేది తెలియచేయాలి.
ఆర్బీఐ: సేవింగ్స్ ఖాతాల‌పై ఇవాళ్టి నుంచి వ‌డ్డీ రేట్లు మార‌బోతున్నాయి. అంటే కొత్త వ‌డ్డీ రేట్లు అమ‌లులోకి వ‌స్తాయి. రూ.1ల‌క్ష లోపు ఉంటే 4.75 శాతం, రూ.1 ల‌క్ష నుంచి రూ.10 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే 6 శాతం, రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.5 కోట్లు ఉంటే 6.75 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. డెబిట్ కార్డు పోగొట్టుకున్నా, పనిరాకుండా పోయినా కొత్త కార్డుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
మినిమ‌మ్ బ్యాలెన్స్: క‌రోనా వైర‌స్ కార‌ణంగా బ్యాంకులు ఇన్ని రోజులు మినిమ‌మ్ బ్యాలెన్స్ నిబంధ‌న‌లు ఎత్తివేశాయి. లాక్‌డౌన్ ముగిసిపోయి.. అన్‌లాక్ 3.0లో అడుగుపెట్టాం. దీంతో ఇవాళ్టి నుంచి మినిమ్ బ్యాలెన్స్ పాత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకులు నిర్ధేశించిన ఫ్రీ తరువాత ఏటీఎం నుంచి తీసుకునే డబ్బులపై ఛార్జీలు వేస్తారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: ఈ పథకం కింద కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నుంది. రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి బ‌దిలీ చేయనున్నారు.

You might also like