FbTelugu

క్రీడాభిమానులకు శుభవార్త

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో అన్నిరంగాలూ కుదేలయ్యాయి. వీటిలో క్రీడారంగానికి కూడా పెద్ద నష్టమే జరిగింది.

అనేక క్రీడా పోటీలు లాక్‌డౌన్‌ అయ్యాయి. దీంతో ఆయా క్రీడా సంస్థలు తీవ్రస్థాయిలో నష్టాల పాలయ్యాయి. క్రీడాభిమానులు కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాభిమానులకు ఒక సంతోషకర వార్త ఇది. ఫుట్‌బాల్‌ పోటీలను వచ్చే నెలలో నిర్వహించాలని ఎఫ్‌ఎఫ్‌టీ ప్రకటించింది.

యూరప్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే ఫుట్‌బాల్‌ టోర్నీలు ఆరంభమైన నేపథ్యంలో తాజాగా జూలై నుంచి ఫ్రాన్స్‌లో టెన్నిస్‌ టోర్నీలను నిర్వహించనున్నట్లు ఫ్రెంచ్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఎఫ్‌ఎఫ్‌టీ) ప్రకటించింది. ఫ్రాన్స్‌ దక్షిణ ప్రాంతమైన రివియెరాలో నిర్వహించే మినీ టూర్‌తో టెన్నిస్‌ క్రీడకు తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు ఎఫ్‌ఎఫ్‌టీ తెలిపింది.

ఈ మినీ టూర్‌లో మొత్తం మూడు టోర్నీలు ఉండగా… ఆరంభ టోర్నీ నీస్‌లో జూలై 6–11 మధ్య… రెండో టోర్నీ కేన్స్‌లో జూలై 13–18 మధ్య… చివరిదైన మూడో టోర్నీ విల్నెవ్‌–లుబేలో జూలై 20–25 మధ్య జరుగుతాయని ఆ సంస్థ ప్రకటించింది. ‘చాలెంజ్‌ ఎలైట్‌ ఎఫ్‌ఎఫ్‌టీ’ పేరుతో ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీల్లో పురుషుల విభాగంలో 24 మంది… మహిళల విభాగంలో 12 మంది బరిలోకి దిగుతారు. ఈ టోర్నీల్లాగానే మిగతా క్రీడలు కూడా త్వరలోనే జరుగుతాయని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

You might also like