FbTelugu

గ్రామీణ విద్యార్థుల కు కేంద్రం గుడ్ న్యూస్

ఢిల్లీ: ఐఐటీ సాధించాలనే పట్టుదల ఉన్నప్పటికీ సరైన శిక్షణ లేక గ్రామీణ విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సరైన శిక్షణ లభిస్తే పట్టణ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా సీట్లు సాధించే సత్తా వీరికి ఉంది.

అయితే వీరి కోసం కేంద్ర ప్రభుత్వం బిహార్ కు చెందిన సూపర్ 30 శిక్షణా కేంద్రం ఆనంద్ కుమార్ తో చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఐఐటీ జేఈఈ కోచింగ్ అందించే ప్రాజెక్టులో ఆనంద్ పాలుపంచుకుంటున్నరని ఈ గవర్నెన్స్ ప్రకటించింది. ఆన్ లైన్ లో ఇచ్చే ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థులు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలని పేర్కొంది.

ఆన్‌లైన్‌లో విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చే మాడ్యూల్‌కు కోర్సును ఆనంద్ తయారు చేయనున్నారు. సైన్స్, లెక్కలు విద్యార్థులు పట్టు సాధించేలాఈ స్టడీ మెటీరియల్ ఉండనున్నది. తన కోచింగ్ సెంటర్ లో ప్రతి ఏడాది 30 మంది పేద విద్యార్థులను ఆనంద్ కుమార్ ఎంపిక చేసుకుని, వారికి ఉచితంగా ఐఐటీ కోచింగ్ ఇస్తుంటారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న చాలా మంది పేద విద్యార్థులు ఐఐటీ కలను నిజం చేసుకున్నారు. ఆనంద్‌ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ ‘సూపర్ 30’ పేరుతో సినిమాను తెరకెక్కించారు.

You might also like