FbTelugu

ఎంఎంటిఎస్ ప్రయాణీకులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: ఎంఎంటిఎస్ లో ప్రయాణిస్తున్న సీజనల్ టికెట్ ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే సదావకాశం కల్పించింది. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి సీజనల్ టికెట్లను వినియోగించుకోని వారు మళ్లీ రెన్యువల్ చేసుకునే అవకాశం ఇచ్చారు.
ఇవాల్టి నుంచి నగరంలో ఎంఎంటిఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి.

కరోనా మహమ్మారితో గతేడాది మార్చి నెలలో నిలిపివేసిన విషయం తెలిసిందే. గతేడాది సీజనల్ టికెట్ తీసుకున్నవారు, వాడుకోకుండా మిగిలి ఉన్నట్లయితే వాటిని రెన్యువల్ చేసుకోవాలని ప్రయాణీకులకు సూచించింది. సీజనల్ టికెట్ లో వాడకుండా మిగిలిన రోజులను ఇప్పుడు వినియోగించుకోవచ్చు. వీటి పొడిగింపు కోసం ఎంఎంటిఎస్, సబర్బన్ స్టేషన్ లలో బుకింగ్ కౌంటర్ల వద్ద సంప్రదించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.