FbTelugu

కరోనా మందంటూ బంగారం అపహరణ

సూర్యాపేట: కరోనా కష్టకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివిగా ఊళ్లలో దొంగతనాలు చేస్తూ సునాయసంగా తప్పించుకుంటున్నారు. కుడ కుడ గ్రామంలో రెడ్డబోయిన ఎల్లమ్మ (75) అనే వృద్ధ మహిళ కు కరోనా మాత్రలు అంటూ ఇచ్చారు.

ఆ మాత్రలు తీసుకున్న వృద్ధురాలు వేసుకున్నది. కొద్ది సేపటికే ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో దొంగలు ఆమె వంటిపై ఉన్న మూడు తులాల బంగారం మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. గ్రామాల్లో కొందరు దుండగులు కరోనా నిర్మూలించే మాత్రలు అని చెప్పి తిరుగుతున్నారు. తమను ప్రభుత్వం వారు పంపించారని ఇంటింటికి తిరిగి ఇస్తున్నామని నమ్మబలుకుతున్నారు. తమ మాటల వలలో పడిన వారికి మత్తు టాబ్లెట్ లు ఇచ్చి పని కానిచ్చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.