FbTelugu

రూ.52 వేలకు చేరువైన పసిడి

న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 51,700 కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 430 పెరిగి రూ. 50,920కి చేరింది. ఇదే సమయంలో ముంబైలో 10 గ్రాముల బంగారం రూ.50,181 గా ఉంది. శ్రావణమాసం కావడంతో దేశంలో బంగారానికి డిమాండ్ భారీగానే ఉండడంతో పసిడి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్నట్టు భావిస్తున్నారు.

You might also like