FbTelugu

ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బంగారం

దేశంలో ఆల్ టైమ్ రికార్డును బంగారం నమోదు చేసింది. ఇవాళ బంగారం ధర రూ.48,829కు చేరుకుంది. గత రోజు ముగింపుతో పోల్చితే ఇది రూ.67 అధికం.

అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మున్ముందు బంగారం ధర రూ. 49 వేలను దాటుకుని వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

ఇవాళ ఆసియా మార్కెట్ లో ఒక ఔన్స్ బంగారం ధర 1,801 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యింది. కరోనా సమయంలో అన్ని రంగాల కన్నా బంగారంపై పెట్టుబడి పెట్టడం ప్రజలు శ్రేయష్కరంగా భావిస్తున్నారు.

You might also like