FbTelugu

2021 లో బంగారం ధర అంత పెరుగుతుందా!

ముంబై: ఏ దేశంలో లేని విధంగా భారత దేశంలో బంగారానికి విలువ అధికంగా ఉంటుంది. మహిళలు పదివేలు మిగిలితే చాలు బంగారం దుకాణానికి పరుగు పెడతారు. తమ డబ్బులను బంగారంపై పెట్టుబడిగా పెడతారు.

దీంతో బంగారం ధరలను ఎప్పటికప్పుడు మహిళలు గమనిస్తూ ఉంటారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ ఈ ఏడాది ధరల పెరుగుదల ఏమాత్రం ఆగలేదు. పెట్టుబడికి సురక్షితంగా ఉండడంతో 2021 లో కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 10 గ్రాముల బంగారం ధర రూ.63వేల వరకు చేరుకునే అవకాశముందంటున్నారు.

ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.56191 పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ధర రూ.39100 వద్ద ప్రారంభమై రూ.56191 కు చేరుకున్నది. యూఎస్ సెనెట్ లో బలహీనమైన మెజారిటీ కారణంగా రాజకీయ అనిశ్చితి, జోన్ బైడెన్ నేతృత్వంలో పరిపాలనా సంస్కరణలు గుదిబండగా మారనున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్ కు సానుకూలంగా మారనుందని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.