FbTelugu

వైష్ణోదేవికి బంగారమే బంగారం…

న్యూఢిల్లీ: కాశ్మీర్ లోని వైష్ణోదేవి ఆలయానికి బంగారం కానుకలు పోటెత్తుతున్నాయి. ఇక్కడి ఆలయాన్ని దర్శించుకోవడం ఉత్తర భారతీయులు ఆచారంగా పాటిస్తారు. గడచిన రెండు దశాబ్ధాల కాలంలో ఈ ఆలయానికి 1800 కేజీల బంగారం కానుకల రూపేణ అందింది.
సమాచార హక్కు చట్టం కార్యకర్త హేమంత్ గునియా ఆర్టీఐ చట్టం ద్వారా ఈ వివరాలు సేకరించారు. కరోనా కారణంగా గతేడాది భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

బంగారంతో పాటు 4700 కిలోల వెండి, రూ.2000 కోట్ల నగదు వచ్చాయి. వైరస్ మూలంగా గత సంవత్సరం 17 లక్షల మంది మాత్రమే వైష్ణోదేవిని దర్శించుకున్నారు. వర్షాకాలం వస్తున్నందున యాత్రికుల వసతుల కోసం ఈ డబ్బును వినియోగించాలని హేమంత్ అన్నారు. విద్యా వికాసాన్ని పెంపొందించేందుకు ఈ నిధులను ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణినికి వెచ్చించాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.