FbTelugu

బంగారం, వెండి ధరలు పైపైకి

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు గురౌతున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు మరో మారు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.132 పెరిగి రూ.48,376 కి చేరింది.

అదే సమయంలో కిలో వెండి ధర ఏకంగా రూ.2,915 పెరిగి ప్రస్తుతం రూ.68,410 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు బంగారం, వెండిపై డిమాండ్ పెరగడం, ఇతర అంశాల కారణంగా బంగారం ధర పైపైకి వెళుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.