* రోడ్డు ప్రమాదంలో 8మంది దుర్మరణం
* మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే
జైపూర్ : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం రాజస్థాన్‌లోని ఖాటూశ్యామ్ జీ ఆలయంలో దర్శనం చేసుకుని స్వస్థలానికి జీపులో వస్తుండగా.. వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా జీపును ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.