FbTelugu

గోద్రా రైలు ప్రధాన నిందితుడు దొరికాడు

గాంధీ నగర్: గోద్రా రైల్వే స్టేషన్ లో కరసేవకుల సజీవ దహనం కేసులో తప్పించుకున్న ప్రధాన నిందితుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన తరువాత పారిపోయి, మళ్లీ వచ్చిన నిందితుడు పోలీసులకు చిక్కాడు.

2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వే స్టేషన్ కరసేవకులతో ఉన్న ఒక ట్రైన్ ఆగింది. అదే స్టేషన్ లో కూలీగా పనిచేస్తున్న రఫీక్ హుస్సేన్ వారు ఉన్న బోగీలపై రాళ్లు విసిరాడు. ఆపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. దహనం అయిందని నిర్థారణ చేసుకున్న తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతని కోసం ఎంతగా వెతికినా దొరకలేదు. పట్టుకునేందుకు రివార్డు కూడా ప్రకటించారు. ఈ ఘటనలో 59 మంది సజీవ దహనం అయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.
అప్పటి నుంచి కన్పించకుండా పోయిన రఫీక్ హుస్సేన్ ఢిల్లీలో కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మళ్లీ గోద్రా చేరుకున్నాడు. పోలీసులకు ఈ సమాచారం తెలియచడంతో వెంటనే అతని ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.