FbTelugu

కొండ పోచమ్మ సాగర్ లోకి గోదావరి పరవళ్లు

సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్ లోకి గోదావరి జలాలను చిన జీయర్ స్వామితో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మర్కుక్ పంప్ హౌస్ నుంచి పోచమ్మ సాగర్ లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భతఘట్టం ఆవిష్కృతం అయింది.

కేసీఆర్, జీయర్ స్వామి గంగపూజ నిర్వహించి జలాలను హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమం కలశ జలాలను సాగర్ లో కలిపారు. కొండపోచమ్మ సాగర్ తో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, గ్రేటర్ హైదరాబాద్ కు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి పాల్గొన్నారు.

కొండపోచమ్మ సాగర్ హైలైట్స్…

నిల్వ సామర్థ్యం: 15 టీఎంసీలు

ప్రాజెక్టు వ్యయం: 1,540 కోట్లు

మొత్తం ఆయకట్టు: 2,85,280 ఎకరాలు

జిల్లాలు: సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, భువనగిరి.

You might also like