FbTelugu

యూజర్ల పర్సనల్ డేటా గోవిందా

హాంకాంగ్: ఏ యాప్ లోనూ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదని బట్టబయలైంది. హాంకాంగ్ కు చెందిన సోషల్ డేటా అనే సంస్థ సోషల్ మీడియా యూజర్ల వ్యక్తిగత వివరాలను అమ్ముకుంటోందని వెల్లడైంది.

వ్యక్తిగత వివరాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నదని కంపారిటెక్ పరోశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేశారు. లీకైన సమాచారంలో యూజర్లకు సంబంధించిన పేర్లు, కాంటాక్టు వివరాలు, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు ఉన్నాయని పేర్కొంది.

ఈ డేటా దొంగలించడానికి వెబ్ స్క్రాపింగ్ పద్దతిని అనుసరిస్తోంది ఆటోమేటెడ్ స్క్రిప్ట్ ద్వారా వెబ్ ఫోర్టళ్లు, వెబ్ పేజీలలోని సమాచారాన్ని సునాయసంగా కాపీ చేసుకుంటున్నది. ఇన్ స్టాగ్రామ్ లో 192.392,954 మంది, టిక్ టాక్ 42,129,799, యూ ట్యూబ్ 3,955,892 మంది యూజర్ల డేటా లీకైంది.

You might also like