FbTelugu

పులి సంచరించే ప్రాంతానికి వెళ్లొద్దు: అటవీ శాఖ

భూపాలపల్లి: అజాంనగర్ నుండి యామనపల్లి దారిలో బండ్లవాగు పరిసర ప్రాంతాల్లో తాజాగా పెద్దపులి సంచరిస్తున్నట్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అటవిశాఖాధికారి కె.పురుషోత్తం తెలిపారు.

పరిసర ప్రాంత ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని, పశువులను అడవి లోపల మేపకూడదని ఆయన కోరారు. పులి ఏకాంతాన్ని భంగపరచరాదని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఆటవీశాఖకు 9440810090 కు గాని,18004255364 టోల్ ఫ్రీ నకు గాని తెలియపరచాలని అన్నారు. 17 ఏళ్ల తర్వాత భూపాలపల్లి అడవుల్లో పులి వచ్చిందన్నారు.
పులి సంచరించే ప్రాంతంలో ఎటువంటి వేట గాని, కరెంట్ తీగలు అమార్చుట నేరము అని పురుషోత్తం తెలిపారు. చెన్నూరు నుంచి అటవీశాఖ అధికారులు వచ్చి తగు సూచనలు, మెళకువలు సిబ్బంది కి తెలిపారు. పులి పంజా గుర్తులను పరిశీలించిన తరువాత మగ పులి గా గుర్తించామని ఆయన వెల్లడించారు.

You might also like