FbTelugu

ప్రేయసి కోసం వెళ్లి.. పాక్ సైనికులకు పట్టుబడ్డాడు

జైపూర్: ప్రేయసిని రహస్యంగా కలిసేందుకు వెళ్లిన ఓ భారత యువకుడు ప్రేయసి తల్లిదండ్రుల నుంచి తప్పించునే క్రమంలో సరిహద్దు దాటి పాక్ సైనికులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన గత నవంబర్ లో చోటుచేసుకొని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. రాజస్థాన్ కు చెందిన గెమ్రా రామ్మేఘ్‌వల్ అనే 19 ఏండ్ల యువకుడు భారత్-పాక్ సరిహద్దులోని ఓ గ్రామంలో నివసిస్తున్నాడు.

గత నవంబర్ లో తన ప్రేయసిని రహస్యంగా కలవడానికి ఆమె ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో అమ్మయి తల్లిదండ్రులు రావడంతో వారినుంచి తప్పించుకోవాలని పరిగెత్తుకుంటూ పాక్ సరిహద్దు దాటాడు. అక్కడి సైనికులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. తాజాగా రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. యువకుడి తల్లిదండ్రులు తమ కుమారున్ని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.