FbTelugu

వైభవంగా గోరెటి వెంకన్న కుమార్తె వివాహం

* హాజరైన సీఎం కేసీఆర్, గవర్నర్ దత్తాత్రేయ

  హైదరాబాద్: తెలంగాణ జన వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కుమార్తె వివాహం ఇవాళ హైదరాబాదులో వైభవంగా జరిగింది. వెంకన్న కుమార్తె తపస్వీ వివాహం మల్లేష్ తో బండ్లగూడలోని పీఎంఆర్ కన్వెన్షన్ లో నిర్వహించారు.
ఈ వివాహానికి సీఎం కేసీఆర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు విచ్చేశారు. గోరెటి మిత్రుడు, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.