FbTelugu

కరోనా కు ఫాబి ఫ్లూ మందు

ఆవిష్కరించిన గ్లెన్‌మార్క్

ఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ కొత్త మందును ఆవిష్కరించినట్టు అధికారికంగా ఇవాళ  వెల్లడించింది.

ఔషధంపై ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఒక ఫాబి ఫ్లూ ఫవిపిరావీర్​ టాబ్లెట్ ధర సుమారు రూ.103 వరకు ఉంటుందని స్పష్టం చేసింది. గుండె జబ్బు, మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వాడవచ్చని, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది.

ప్రారంభ, మధ్యస్థ లక్షణాలతో వ్యాధిగ్రస్తులు ఈ మందును వినియోగించడానికి రూపొందించారు. 200 ఎంజీల తో ఉన్న 34 టాబ్లెట్ల ధరను రూ.3,500 గా నిర్ణయించారు. కరోనా బారిన పడ్డవారు తొలి రెండు రోజులు 1800 టాబ్లెట్లను మొదటి రోజు రెండు సార్లు వేసుకోవాలని గ్లెన్‌మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దానా తెలిపారు.

ఆ తరువాత రెండు వారాల పాటు ప్రతి రోజు రెండుసార్లు 800 ఎంజీల పరిమాణం కలిగిన టాబ్లెట్లను వాడాలి. ఇవాళ సాయంత్రం నుంచి మందు కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తుందని, వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా లభ్యమవుతుందని ఆయన తెలిపారు.

You might also like