FbTelugu

డొక్కు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: తనకు ప్రాణహానీ ఉందని తెలిసి కూడా తెలంగాణ పోలీసులు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు.

ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారంగానే తనకు వాహనం ఇచ్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తే కిలోమీటర్ కు రూ.37 చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన వాహనం కూడా డొక్కు డొక్కు ఉందని, డోర్ లాక్ వేస్తే తిరిగి తెరుచుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ మంత్రులకు కొత్తవి ఇచ్చి తనకు మాత్రం పాడుపడిన పాతది ఇచ్చారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం సీఎం గా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వాహనాన్ని తనకు కేటాయించారంటే పోలీసులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చని రాజాసింగ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.