FbTelugu

ఇదేం రక్షణ… మాకు ఇవ్వండి: సిరం డిమాండ్

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏరికోరి తలనొప్పి తెచ్చుకున్నది. స్వదేశీ మంత్రం పేరుతో ఇన్నాళ్లు జనానికి సుద్దులు చెప్పిన బిజెపి ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతించింది.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని వాటికి చట్టపరమైన రక్షణ కల్పించడంతో చిక్కులు మొదలయ్యాయి. మున్ముందు వివాదంగా మారే ప్రమాదం ఉంది. ఇండియన్ వ్యాక్సిన్ కు అయినా, విదేశీ వ్యాక్సిన్ కు అయినా ఒకేరకమైన రక్షణ ఉండాలని సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఒ అదర్ పునావాల్లా స్వరం పెంచారు. మోడెర్నా, ఫైజర్ లాగా తమకు చట్టరమైన రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలనేది తమ వాదన అని స్పష్టం చేశారు. అమెరికాలో వ్యాక్సిన్ కంపెనీలకు చట్టబద్దమైన రక్షణను అక్కడి ప్రభుత్వం కల్పించింది. దేశంలో వ్యాక్సిన్ మూలంగా ఎవరికైనా ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తినా, నష్ట పరిహారం కోసం సంబంధిత వ్యాక్సిన్ కంపెనీ నుంచి పరిహారం కోసం డిమాండ్ చేసే హక్కు ఉండదు. ఫైజర్, మోడెర్నాకు కు అమెరికా ప్రభుత్వం ఇలాంటి రక్షణ కల్పించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది.
ఈ గండం నుంచి బయటపడేందుకు ఫైజర్, మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వారు ఒక షరతు విధించారు. అమెరికా మాదిరి మాకు చట్టపరమైన రక్షణ కల్పిస్తేనే వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని షరతు విధించండం, దానికి మోదీ ప్రభుత్వం అంగీకరించడం దాదాపు పూర్తయింది. ఈ వార్త తెలిసిన తరువాత సిరం కంపెనీ సిఈఓ కూడా పల్లవి అందుకున్నారు. తమ వ్యాక్సిన్ల వల్ల ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే కోర్టులలో కేసులు వేయకుండా రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.