FbTelugu

మెహుల్ చొక్సి కి డోమినికా కోర్టులో నిరాశే

రోజౌ: పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం ఎగవేతదారుడు, గీతాంజలి జ్యూయల్లర్స్ అధినేత మెహుల్ చోక్సి కి డోమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
డోమినికా దేశంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, దేశం విడిచి వెళ్లనని ఇచ్చిన హామీని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

తన సోదరుడు ఇక్కడే ఉంటారని, అతనితో కలిసి ఉంటానని విన్నవించగా, ఈ దేశం నీ స్థిరనివాసం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం బలమైన పూచికత్తు ఇవ్వకపోవడం, వేరే దేశాలకు పారిపోయే అవకాశం ఉండడంతో బెయిల్ లభించలేదని అంటిగ్వా మీడియా పేర్కొంది. మెహుల్ చొక్సి పంజాబ్ బ్యాంకు కు వేల కోట్ల రూపాయలు బకాయి పడి 2018లో భారత్ నుంచి అంటిగ్వాకు పరారీ అయ్యాడు. అప్పటి నుంచి భారత్ కు రాకుండా తలదాచుకుంటున్నాడు. ప్రియురాలి వద్దకు వెళ్లగా, అక్కడ ఆమె పోలీసులకు పట్టించడంతో మెహుల్ చోక్సి గుట్టురట్టయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.