FbTelugu

ఇండియా పేరు చెబితే రోగం పెరుగుతోంది!

డోమినికా: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేతదారు మెహుల్ చోక్సి అనారోగ్య కారణాలు చూపి ఇండియా కు తిప్పి పంపకుండా చూసుకుంటున్నారు. అనారోగ్యం కారణంగా చోక్సి రాకపోవడంతో డోమినికా న్యాయస్థానం విచారణను జూన్ 25కు వాయిదా వేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్టియం రుణాల ఎగవేసిన గీతాంజలి జ్యూయల్లర్స్ అధినేత మెహుల్ చోక్సి పరారీలో ఉంటున్నాడు.

ఆయన డోమినికాలో ఉంటూ ప్రియురాలి ఇంటివద్ద అక్కడ పోలీసులకు పట్టుబడడం, దేశంలో అక్రమంగా ప్రవేశించాడని అరెస్టు చేయడం తెలిసిందే. సోమవారం నాడు డోమినికా కోర్టుకు మెహుల్ హాజరు కావాల్సి ఉండగా, అనారోగ్యంగా ఉన్నాడని అతని తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ మేరకు డొమినికా చైనా ఫ్రెండ్ షిప్ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన కోర్టు విచారణను 25వ తేదీకి వాయిదా వేసి, తదుపరి రిమాండ్ కోసం 17ను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇండియాకు అప్పగించకుండా ఉండేందుకు మెహుల్ న్యాయవాదులు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.