FbTelugu

ప్రేమించిన నన్ను కూడా చోక్సీ మోసం చేశాడు!

న్యూఢిల్లీ: బ్యాంకులను మోసగించిన కేసులో పోలీసుకస్టడీలో ఉన్న గీతాంజలి రిటైల్ జ్యూయల్లరీ కంపెనీ అధినేత మెహుల్ చోక్సి ఆఖరిని ప్రేమించిన ప్రియురాలిని కూడా మోసం చేశాడు.

ఈ విషయాన్ని గర్ల్ ఫ్రెండ్ బార్బారా జరాబిక్ వెల్లడించడం విశేషం. గతేడాది తను ఆంటిగ్వా వెళ్లినప్పుడు చోక్సీ తనకు పరిచయం అయ్యాడని, తన పేరు ను రాజ్ గా చెప్పుకున్నాడి ఆమె తెలిపింది. మొదట్లో ఇద్దరం ఫ్రెండ్లీగా ఉన్నామని, ఆ తరువాత కలిసి తిరిగామని ఆమె చెప్పింది. ఇద్దరం దగ్గరకావడంతో డైమండ్ రింగులు, బ్రాస్ లెట్లు, ఖరీదైన బహుమతులు ఇచ్చాడని తెలిపింది. ఇటీవల వాటిని నగల దుకాణం వెళ్లి చూపించగా నకిలీవి అని తేలడంతో తాను మోసపోయినట్లు గ్రహించినట్లు బార్బారా తెలిపింది.
ఆంటిగ్వాలో మెహుల్ కిడ్నాప్ వ్యవహారంలో తన పాత్ర లేదని ఆమె స్పష్టం చేసింది. తన పేరును ఆయన లాయర్లు, కుటుంబ సభ్యులు పదే పదే వల్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నా పేరు బయటకు రావడంతో తన భర్త, పిల్లలు తీవ్ర ఒత్తిడితో ఉన్నామని వెల్లడించింది. తను బార్బారా ను కలవాడానికి వెళ్లిన సందర్భంలో కిడ్నాప్ చేసి, అరెస్టు చేశారని. అక్కడి నుంచి బోట్ లో డొమినికా కు తీసుకువచ్చారని ఆంటిగ్వా పోలీసుకు రాసిన లేఖలో చోక్సి ఆరోపించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.