FbTelugu

ప్రియుడి ఇంటిని ధ్వంసచేసిన ప్రియురాలి కుటుంబం

కర్నూలు: ప్రేమజంట పరారీ కావడంతో ఆ గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒకరిపై మరొకరు కత్తులు దస్తుండడంతో పోలీసులు బలగాలు వచ్చాయి. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

కృష్ణగిరి మండలం కోయిలండలో ప్రేమికులు పరారీ అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడి ఇంటికి మీదికి వచ్చారు. వచ్చిరావడంతోనే ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. తమ ఇంటినే ధ్వంసం చేస్తారా అంటూ ఎదురుతిరిగారు. పరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారగా, పలువురికి గాయాలయ్యాయి.

You might also like