FbTelugu

ప్రియురాలి పెళ్లికి ఆడవేషంలో వెళ్లాడు… చితక్కొట్టారు…

లక్నో: ఒక యువకుడు ప్రాణానికి ప్రాణంగా ఒక యువతిని గాఢంగా ప్రేమించాడు. అయితే ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇక అప్పటి నుంచి అతనికి ఆవేదన, ఆమెపై ధ్యాస తప్ప మరోటి లేదు.
ఆమెను చివరి సారిగా ఎలాగైనా చూడాలనే ఉద్ధేశంతో ఆడవేషంలో వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. యువతి బంధువులు అతన్ని దొరకబుచ్చుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

అతనితో పాటు వచ్చిన ఇద్దరు స్నేహితులు జంప్ అయ్యారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బదోయి ప్రాంతానికి చెందిన యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి తరఫు కుటుంబానికి తెలియడంతో విడదీసి, బెదిరించారు. మరొక యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయించారు. పెళ్లి తేది తెలియడంతో వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాడు. ముహూర్తం సమయానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడ వేషంలో వెళ్లాడు. కాని అతని నడవడిక చూసిన యువతి బంధువులు ఆరా తీశారు. అడ్డగించి ప్రశ్నలు వేయడంతో పక్కనే ఉన్న ఇద్దరు స్నేహితులు జారుకున్నారు. ఇంకేముంది యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత వివాహం చేసి, యువతిని వరుడి ఇంటికి పంపిచారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.