FbTelugu

జగిత్యాలలో ప్రేయసి.. దుబాయ్‌లో ప్రియుడు సూసైడ్

* ఇంట్లో చెప్పలేక యువతి, ఆపై ప్రియుడు
జగిత్యాల: తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేక ఓ యువతి, తన ప్రేయసి చనిపోయిందని దుబాయ్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందుపల్లికి చెందిన లింగంపల్లి మనీషా అనే యువతి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తాజాగా లక్ష్మీపూర్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు దుబాయ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాకేష్ ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసి తన తల్లికి పంపాడు. రాకేష్, మనీషా ప్రేమించుకున్నారని అయితే పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పలేక పోవడంతో ఇంట్లో మనీషాకి పెళ్లి కుదిర్చారు. వేరే పెళ్లి చేసుకోలేక మనీష ఆత్మహత్య చేసుకుందని, మనీషా లేకుండా తాను బతకలేనంటూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.