FbTelugu

ప్రియురాలు ధర్నా.. చితకబాదిన వైనం

నిర్మల్: తాను ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందు నిరసనకు దిగింది. దీంతో ప్రియుని బంధువులు యువతని చితకబాదారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని మామడలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. మామడకు చెందిన ఓ యువకుడు తనని ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి తనకు న్యాయం చేయాలంటూ.. ప్రియుని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఇది నచ్చని యువకుని బంధువులు యువతిపై దాడికి దిగారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రియుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.