FbTelugu

గ్రహణాన్ని చూస్తూ భవనం పైనుంచి పడిన బాలిక

నెల్లూరు: సూర్యగ్రహణాన్ని చూస్తూ ఓ బాలిక భవనం పైనుంచి పడిన ఘటన జిల్లాలోని మర్రిపాడు మండలం, కండ్రిగలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇవాళ ఏర్పడిన సూర్యగ్రహానాన్ని అందరూ ఆసక్తిగా వీక్షిస్తుండగా.. ఓ బాలిక కూడా భవనం పైనుంచి సూర్యగ్రహణాన్ని వీక్షిస్తుండగా.. ప్రమాదవశాత్తు బవనంపైనుంచి కిందపడింది. ఈ ఘటనలో బాలిక రెండు కాళ్లూ, చేతులు విరిగిపోయినట్టుగా గుర్తించారు. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like