FbTelugu

బాలిక ఏడ్పులు… కిడ్నాపర్ పరారీ

మచిలీపట్నం: నగరంలోని సుకార్లబాదులో ఒక బాలిక కిడ్నాప్ కు అగంతకుడు విఫలయత్నం చేసి సఫలం కాకపోవడంతో వదిలేసి పారిపోయాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారిస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకర్లాబాదులో ఇంటి బయట ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలికను ఒక అగంతకుడు మాటలు కలిపాడు. మీ ఇంటి వద్ద ఇల్లు ఏమైనా అద్దెకు ఉన్నాయా, ఇస్తారా అంటూ మాటల్లో పెట్టి ముఖంపై స్ప్రే కొట్టి టూ వీలర్ పై ఎక్కించుకుని బయలుదేరాడు. బాలికకు కాసేపటికి స్పృహ వచ్చి ఏడుస్తుండటంతో భయపడిన అగంతకుడు కిలోమీటర్ అవతల వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.