FbTelugu

తన ఫోటో డిపిగా పెట్టుకున్నాడని…

మేడ్చల్: పనిచేస్తున్న తోటలో పరిచయం అయిన బాలిక ఫొటోను తన వాట్సప్ లో ఒక బాలుడు పెట్టుకోవడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం బోయిన్ పల్లికి బాలుడు అదే గ్రామానికి చెందిన ఒక బాలికతో స్నేహంగా ఉండేవాడు. వారిద్దరు కొన్ని రోజులుగా మేడ్చల్ జిల్లా ముచింతలప్లి మండలం పోతారం లోని కూరగాయల తోటలో పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో బాలుడు (17) తన వాట్సప్ స్టేటస్ లో బాలిక ఫొటో డిపిగా పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన బాలిక మనస్తాపానికి గురై తోటలోనే పురుగుల మందు సేవించింది. అపస్మారక స్థితికి చేరుకోవడంతో బాలికను తోటలో పనిచేస్తున్నవారు సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చేర్చుకోకపోవడంతో ఈసిఐఎల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.