FbTelugu

బాలిక ఆత్మహత్య… ప్రొఫెసర్ పై వేధింపు కేసు

గౌహతి: తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తూ చదువుపై ధ్యాస లేకుండా చేస్తున్న అధ్యాపకుడి ఇంట్లోనే ఒక బాలిక ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అస్సాంలోని బెంగ్తాల్ లో ఒక కళాశాలలో ప్రొఫెసర్ పనిచేస్తున్నాడు. చదువు కోసం ఏడాది కాలంగా 14 సంవత్సరాల బాలిక నివాసం ఉంటోంది. శారీరకంగా హింసించడంతో తట్టుకోలేని బాలిక బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు బాలిక తన స్నేహితురాలికి ఎస్.ఎం.ఎస్ పంపించింది. అధ్యాపకుడు నిత్యం తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు అధ్యాపకుడు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్నేహితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రొఫెసర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.