FbTelugu

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్ ప్రమాణస్వీకారం

girish-in-as-Lieutenant-Governor-of-Jammu--Kashmir

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నేడు గిరీష్‌ చంద్ర ముర్ము చేత హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ గీతా మిట్టల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. లడఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్‌ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడిన జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌లుగా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తులుగా గిరీష్‌ చంద్ర, రాధాకృష్ణ నిలిచారు. జమ్మూకశ్మీర్‌ను విభజించిన తర్వాత జమ్మూకశ్మీర్‌తో పాటు లడఖ్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం విదితమే.

You might also like