FbTelugu

ఘోరం… డ్రైవర్ నిర్లక్ష్యంతో పలువురి మృతి

కర్నూలు: సిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రిస్మస్ మాసం సందర్భంగా క్రైస్తవులు వేకువజామున ప్రార్థనలు చేసి తిరిగి వెళ్తున్న వారిపై డీసీఎం దూసుకు వెళ్లింది.
ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యయి.

ఈ ప్రమాదానికి కారణమైన డీసీఎంను డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో స్థానికులు వెంటపడి బత్తులూరు వద్ద పట్టుకున్నారు. యర్రగుంట్ల నుంచి నడిచి వెళ్తున్న 40 మంది క్రిస్టియన్ లపై డీసీఎం దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే సురేఖ(10), ఝాన్సీ(11), వంశీ(10), హర్షవర్ధన్(10) చనిపోయారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.