FbTelugu

150 డివిజన్లలో 1,112 మంది అభ్యర్థులు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.
బ్యాలెట్ పేపరు పద్ధతిలో జరుగుతున్న పోలింగ్ లో 150 డివిజన్లలో 9,101 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎన్నికల బరిలో 1,122 మంది అభ్యర్థులు ఉన్నారు. జంగంమెట్‌ డివిజన్‌లో అత్యధికంగా 20 మంది అభ్యర్థులు ఉండగా, ఉప్పల్, బార్కస్, నవాబ్‌సాహెబ్‌ కుంటలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండడం విశేషం. జీడిమెట్ల, టోలిచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులే పోటీ చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో గ్రేటర్‌లో 74,44,260 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో అత్యధికంగా 79,290 మంది ఓటర్లు, రామచంద్రాపురం డివిజన్‌లో అత్యల్పంగా 27,998 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం 48 వేలమంది సిబ్బంది వినియోగిస్తుండగా, ఉపాధ్యాయులను నియమించుకోలేదు.
ఎన్నికల కోసం 14 మంది సాధారణ పరిశీలకులు, 38 మంది వ్యయ పరిశీలకులు నియమించారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 30 సర్వైలెన్స్ బృందాలు పనిచేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.