FbTelugu

లంచం తీసుకుంటూ పట్టుబడిన జిహెచ్ఎంసి డిఈ

హైదరాబాద్: కరోనా మహమ్మారి సమయంలోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ప్రజలను పట్టి పీడించి వసూళ్లు చేస్తున్నారు. చేసిన పనికి బిల్లులు మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో ఒక వ్యక్తి ఏసిబిని ఆశ్రయించి పట్టించాడు.

జిహెచ్ఎంసి కాప్రా కార్యాలయంలో డిఈ గా మహాలక్ష్మీ పనిచేస్తోంది. ఇవాళ ఉదయమే ఒక వ్యక్తి నుంచి రూ.20వేలు నగదు తీసుకున్న తరువాత ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మల్లాపూర్ చౌరస్తాలోని స్వాతి టిఫిన్ సెంటర్ లో ఆమె డబ్బులు తీసుకుంటుండగా పట్టపడింది. ఏసిబి సిబ్బంది వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.