FbTelugu

కన్యలు కాని భార్యలు గెంటివేత

ముంబయి: హైటెక్ యుగంలో ఉన్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న పాలనలో ఇంకా పురాతన ఆచారాలు, కట్టుబాట్లు కొనసాగుతున్నాయి. పురాతన ఆచారం ఇద్దరు మహిళల పాలిట శాపంగా పరిణమించింది

కొల్హాపూర్ జిల్లాలో భార్య కన్యత్వ పరీక్షలు ఫెయిల్ అయిందంటూ ఒక భర్త ఇంటి నుంచి గెంటేశాడు. అదే ఇంట్లో ఉంటున్న ఆమె సోదరిని కూడా పుట్టింటికి పంపించేశారు. గత ఏడాది నవంబర్ లో బెల్గంలోని కంజర్భట్ తెగకు చెందిన ఇద్దరు సోదరులు వివాహం చేసుకున్నారు. ఇద్దరు సోదరులు కూడా అక్కా చెల్లెళ్లను పెళ్లి చేసుకున్నారు. కంజర్బట్ తెగ ఆచారం ప్రకారం పెళ్లైన వెంటనే కన్వత్వం ఉందా లేదా అనేది పరీక్షిస్తారు. భార్యా, భర్తను బెడ్ రూమ్ పంపించి తొలి కలయిక చేయించారు. ఈ కలయికలో రక్త వస్తే కన్యత్వం ఉన్నట్లుగా భావిస్తారు. ఆ తరువాతే సంసారం చేయడానికి అనుమతిస్తారు. ఈ పరీక్షలో ఒకరి భార్య ఫెయిల్ అయింది. ఫిబ్రవరిలో జాట్ పంచాయతీ కుల పెద్దలు పంచాయతీ జరిపి, అక్కచెల్లెళ్లకు విడాకులు ఇవ్వాలని తీర్పు చెప్పారు.

ఆ తీర్పు ప్రకారం పుట్టింటికి వెళ్లిపోవాల్సిందిగా భర్తలు ఆదేశించారు. అత్తా మామలు కూడా వేధించడంతో వారిద్దరు రాజారామ్ పూరి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. తమకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారని, ఫెయిల్ అయ్యామంటూ ఇంటి నుంచి గెంటేశారంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ను నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచిత్రమేమంటే ఇద్దరి భర్తలో ఒకరు ఆర్మీలో పనిచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.