FbTelugu

అప్పు కింద కుమార్తెనిచ్చాడు…

లక్నో: అప్పు తీర్చేందుకు భూములు అమ్మడం, బంగారం అమ్మడం మనం విన్నాం. కాని రూ.2 లక్షలు అప్పు తీర్చేందుకు కన్న కుమార్తెను అమ్మేశాడో తండ్రి.

మీరట్ జిల్లా పర్తాపూర్ లోని శతాబ్ధి నగర్ లో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. తండ్రి లారీ డ్రైవర్ అయిన ఒక వ్యక్తం నుంచి రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. బరౌట్ జిల్లాకు చెందిన అతనిపై క్రిమినల్ కేసులతో పాటు తిహార్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తీసుకున్న అప్పు చెల్లించాలని కొద్ది రోజులుగా డ్రైవర్ వెంటపడుతున్నాడు. పెళ్లీడుకొచ్చిన తన కుమార్తెను అప్పు కింద తీసుకోవాలని తండ్రి కోరగా అతను అంగీకరించాడు. ఆ ప్రకారంగానే అమ్మాయిని డ్రైవర్ తో పంపించేశాడు. ఏడాది కాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో యువతి తప్పించుకుని తిరిగి ఇంటికి వచ్చింది. తల్లితో కలిసి మీరట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ను కలిసి డ్రైవర్ పై ఫిర్యాదు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.